సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ‘మురారి’ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. విభిన్న చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఎవర్‌గ్రీన్‌. శుక్రవారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన అల్టిమేట్ క్లాసిక్ ఒక్కడు సినిమా కూడా ఈరోజు థియేటర్‌లో రీ-రిలీజ్ కానుంది. దీంతో మహేష్ బాబు అభిమానులు థియేటర్ల ముందు సందడి చేస్తున్నారు. మార్నింగ్ ఒక్కడు చూసి ఒక అమ్మాయిని ప్రేమించేసి, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడానికి మురారి చూడబోతున్నాం అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

అంతేకాకుండా థియేటర్లోకి అడుగు పెట్టేముందు అక్షింతలు కూడా తీసుకువెళ్లడం విశేషాన్ని సంతరించుకుంది. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ల ముందు చేసే హడావిడి ఎవర్ గ్రీన్ అంతే కాగా థియేటర్లలో హిట్ బొమ్మ పడిన ఈ సినిమాలకి మరోసారి అదే థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండటం గొప్ప అనుభూతి. అయితే ఇవాళ మహేష్ పుట్టినరోజు స్పెషల్ గా రాజమౌళి SSRMB 29 నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *