Coolie OTT Streaming: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన “కూలీ” ఆగస్ట్ 14న పాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌లతో భారీ హైప్ క్రియేట్ చేసినా థియేటర్లలో మాత్రం ఆ అంచనాలకు తగ్గ ఫలితం ఇవ్వలేకపోయింది. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. అలాగే లాజిక్ లేని కథ, రజినీ మార్క్ పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. లోకేష్ కనకరాజ్ గత సినిమాలు కల్ట్‌గా నిలిచినా “కూలీ” మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయినా థియేటర్స్‌లో ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి తమిళనాట రికార్డులు సృష్టించింది. కానీ తెలుగు, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం కొంత నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 11 నుంచి పాన్-ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న “కూలీ” ఓటీటీలో ఎలా రిస్పాన్స్ పొందుతుందో చూడాలి.
Internal Links:
‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్..
External Links:
కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిందిగా.. ఎక్కడ చూడాలంటే..