Coolie Overseas Review: సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ సినిమా కూలీ. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ క్యామియో పాత్రలో నటించారు. ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ హీరో ఉండటంతో, ఇది భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్‌గా నిలిచింది. భారీ హైప్, రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మధ్య విడుదలైన ఈ చిత్రం, ఓవర్సీస్ ప్రీమియర్స్‌ను ముగించింది.
సినిమా మొదట సూపర్ స్టార్ 50 ఏళ్ల స్పెషల్ టైటిల్ కార్డుతో ప్రారంభమైంది. కానీ మొదటి గంట వరకు కథ చాలా సద్దుగా సాగింది. ఒకే ఒక్క ఫైట్ సీన్ మాత్రమే హై ఫీల్ ఇచ్చింది, మిగతా భాగం బలహీనంగా అనిపించింది. ఊహించని మలుపు, మంచి ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఈ భాగాన్ని నాగార్జున, సౌబిన్ షాహిర్ తమ నటనతో కొంతవరకు నిలబెట్టారు. నాగార్జున స్టైల్, “I am the Danger” సాంగ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేలా ఉంది. కానీ సెకండాఫ్ మొదలు నీరసంగా సాగి, వావ్ అనిపించే మోమెంట్ ఎక్కడా కనిపించలేదు. యాక్షన్ సీన్స్‌లో పాత పాటలను వాడటం తప్ప, లోకేష్ క్రియేటివిటీ కనిపించలేదు. హిట్ అయిన “మోనికా” పాట ప్లేస్‌మెంట్ సరిపోలలేదు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు తప్ప చెప్పుకోదగ్గ అంశం లేకపోవడంతో, ఓవర్సీస్ టాక్ ప్రకారం కూలీ అంచనాలను అందుకోలేకపోయింది.
Internal Links:
ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది..
వార్ 2, కూలీ టికెట్స్ రేట్స్ పెంపు..