ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి వచ్చింది. అందుకే షూటింగ్ సాఫీగా సాగుతోంది. దర్శకుడు సుకుమార్ లాంగ్ షెడ్యూల్ లో రెండు టీమ్ లతో జెట్ స్పీడ్ తో తెరకెక్కిస్తున్నాడు.

సినిమా సెకండాఫ్ బ్యాలెన్స్ పూర్తవుతుండగా, ఒక టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో, మరో టీమ్ కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా బన్నీ కాకినాడ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అక్టోబర్ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత రవిశంకర్ వారం రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా నవంబర్ రెండో వారంలో ట్రైలర్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే నెలలో ఈ సినిమాలోని 4 పాటల్లో క్లైమాక్స్ లో వచ్చే స్పెషల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐటమ్ సాంగ్ రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు ఆ పాటను రిలీజ్ చేయాలని యూనిట్ చూస్తోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *