కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆరేళ్లకు తారక్ సినిమా రావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ దేవర తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది. దేవర దేశవ్యాప్తంగా రూ.77 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు కొల్లగొట్టింది.ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే రూ. 68కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారి హీరోయిన్ గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు.