కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం దేవర. ఈ చిత్రం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. దేవర చిత్రం 27 సెప్టెంబర్ 2024 న విడుదల కానుంది. తమిళ్ మరియు తెలుగులో మంచి పేరు సాధించుకున్న హీరో కార్తీ చిత్రం “మెయ్యళగన్” కూడా అదే రోజు విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పోటీగా దిగుతున్నాడు అని అందరు అంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న దేవర మూవీ తెల్సిందే కాగా పోటీకి దిగుతున్న కార్తీ చిత్రం ప్యాన్ ఇండియా కాకపోయినా తమిళ్, తెలుగులో కాంపిటీషన్ ఇచ్చేందుకు బరిలో దిగుతున్నాడు. కార్తీ మూవీ అంటే తమిళ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంటుంది. తెలుగు ప్రజలు కార్తీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తారు. కార్తీ నటించిన కొన్ని సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే భారీ విజయాలు సాధించడం చూశాం. అందుకే కార్తీ సినిమా కూడా అదే రోజు వస్తోందంటే కొంత ఆసక్తి ఉండటం సహజం అని తెలుస్తుంది. కానీ కచ్చితంగా కార్తీ ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వగలడా అంటే 100 శాతం లేదు అనే చెబుతాం. కాకపోతే తమిళ్ లో కొంత వరకూ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది అని కిలక వర్గాలు తెలుపుతున్నాయి .
