యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర” సినిమా తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ ఆగస్ట్ 5న, మేకర్స్ చుట్టమల్లె అనే పాటను విడుదల చేశారు. చుట్టమల్లే అంటూ సాగిన ఈ రెండో పాట ఫుల్ రొమాంటిక్ అండ్ మెలోడీయస్‌గా సాగింది. ఈ పాట అయితే ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేసింది. కానీ యాంటీ ఫ్యాన్స్ కు ఈ పాట కాపీ పేస్ట్ చేసారని అన్ని వర్గాల నుండి విమర్శలు తలెత్తుతున్నాయి. జాన్వీ కపూర్ నటనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్‌పై నెటిజన్లు కాపీ పేస్ట్ చేసాడని కొంత ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి యహాని పాడిన మనికే మాగే హితే అనే శ్రీలంక పాట నుండి సంగీత దర్శకుడు ట్యూన్‌ను కాపీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనిరుధ్ ఇతర పాటల మాదిరిగా కాకుండా ఇది బలహీనమైన పని అని విమర్శకులు కూడా అంటున్నారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. జాన్వీ కపూర్‌కి ఇది తొలి తెలుగు సినిమా. ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024న థియేటర్లలో విడుదల కానుంది.