కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కానుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాటలకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ వెయింగ్ మామూలుగా లేదనుకోండి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్‌లో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా గడిపేస్తున్నారు.

తెలుగులో మాత్రం దేవర చిత్ర ప్రమోషన్స్ చాలా తక్కువగా నడుస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల (సెప్టెంబరు) 22 న గ్రాండ్ గా చేస్తారని సమాచారం. కుదిరితే రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ సినిమాలకు చేసినట్టు చేద్దామని లేదా ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో చేద్దామని ప్లాన్ చేస్తున్నారట దేవర యూనిట్. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గెస్ట్ గా వస్తాడని టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ మహేష్ ను ఆహ్వానించినట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *