టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఎంతగానో ప్రేక్షకుల ఆదరణ పొందింది. రామ్ యాక్టింగ్ తో పాటు హీరోయిన్స్ అందచందాలు కూడా ఈ సినిమాలో ప్లస్ గా నిలిచాయి. మొత్తంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రానుంది. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన, ఫైటింగ్స్ సన్నివేశాలు చూసాక సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా, సంజయ్ దత్ విలన్ గా కీలక పాత్రా పోషించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈసారి కూడా రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడంటూ అభిమానాలు కామెంట్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *