ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసాకు తన చిత్రంలో ఆఫర్ చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రాను సోమవారం అరెస్టు చేశారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.
ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక వర్ధమాన నటిపై పలుమార్లు అత్యాచారం చేశాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సనోజ్ మిశ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు అతనికి బెయిల్ నిరాకరించడంతో అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.