HHVM OTT

Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు సినిమా మరోసారి కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు చివరికి సిద్ధమైంది. జూన్ 21 శనివారం నాడు మేకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ, ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ‘ఒకరు అధికారం కోసం పోరాడుతారు. ఒకరు ధర్మం కోసం పోరాడుతారు. అందులోనే వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది. సత్యం, విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం యుద్ధానికి సాక్ష్యమివ్వండి. జులై 24న థియేటర్లలో హరి హర వీరమల్లు అడుగెట్టబోతుంది. ప్రేక్షకుల రాకకోసం ఒక చారిత్రక అనుభవం వేచి ఉందిని’ మేకర్స్ పోస్టులో వెల్లడించారు.

Hari Hara Veeramallu సినిమా ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, ప్రారంభం నుంచి అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం, దర్శకుడు క్రిష్ మధ్యలో తప్పుకోవడం, కథలో మార్పులు, షూటింగ్లో జాప్యం ఇలా ఎన్నో చిక్కులను దాటుతూ చివరకు చిత్రీకరణ పూర్తయింది. కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా సినిమా విడుదల విషయంలో అంతగా స్పష్టత లేకుండా మే అని, జూన్ అని తారీఖులు మారుతూ వచ్చాయి. చివరికి జూన్ 12న విడుదల కాబోతుందన్న అంచనాలు కూడా సీజీ వర్క్ కారణంగా నిరాశకు గురయ్యాయి. ఇప్పుడు మాత్రం మేకర్స్ జూలై 24ని ఫిక్స్ చేసి అధికారికంగా వెల్లడించడంతో సినిమాపై మళ్లీ అంచనాలు పెరిగాయి.

ఈ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాను క్రిష్ మరియు జ్యోతికృష్ణ కలిసి దర్శకత్వం వహించగా, దయాకర్ రావు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఏఎం రత్నం ఈ సినిమాను సమర్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, నాజర్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ విభాగంలో మనోజ్ పరహంస, వీఎస్ జ్ఞానశేఖర్ తమ ప్రతిభను చూపించారు. చివరకు, హరిహర వీరమల్లు జులై 24న ఓ గ్రాండ్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు.

Internal Links:

కుబేర ఓవర్శీస్ రివ్యూ..

‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ రిలీజ్..

External Links:

అఫీషియల్.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *