HHVM OTT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇ. దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న, పీరియాడికల్ సినిమా అవుతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు సినిమాపై బజ్‌ను పెంచాయి.

కాగా ఈ సినిమాను మొదట ఈ ఏడాది మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింట్ అప్పటికి ఫినిష్ అవకపోవడంతో విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు. అయితే ఇప్పడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ డేట్ కు హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబందించి కొన్ని కీలకమైన సీన్స్ పెండింగ్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా హరిహర వీరమల్లు ఫినిష్ అవలేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రిలిజ్ వాయిదా వేసిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ కు కూడా సరైన క్లారిటీ లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *