డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీని ఎప్పుడో ప్రకటించారు. ఆగస్ట్ 15న వస్తుందని డబుల్ ఇస్మార్ట్ టీమ్ ఇప్పటికే ధృవీకరించింది. కానీ మిస్టర్ బచ్చన్ కూడా అదే తేదీకి రానుంది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే రోజు వస్తే, కలెక్షన్లలో తేడా వస్తుంది. ఓపెనింగ్స్ తగ్గుతాయి. రెండు సినిమాలకు టాక్ వస్తే బాగుంటాయి. లేకపోతే, దారుణంగా పరిస్థితులు ఉంటాయి. సోలోగా వస్తే ఓపెనింగ్ డే నాటికి కనీసం సగం నుంచి సగానికి కోలుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది.
ఆగస్ట్ 15 మీద చాలా మంది కన్నేశారు. విక్రమ్ తంగలాన్ కూడా వస్తోంది. ఇంకో రెండు, మూడు చిన్న చిత్రాలున్నాయి. తెలుగులో ప్రధాన పోటీ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ మధ్యే ఉంటుంది. అందుకే ఛార్మీ రాయబారం చేయడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. మిస్టర్ బచ్చన్ టీంతో సంప్రదింపులు జరిపినట్టుగా ఉంది. అవి సఫలం కాకపోవడంతో ఇలా ఛార్మీ తన ఇన్ స్టాలో హరీష్ శంకర్, రవితేజలను అన్ ఫాలో కొట్టేసినట్టుగా సమాచారం.