కొంత విరామం తరువాత కథానాయిక సాయిపల్లవి తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ‘అమరన్‌’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. ఈ చిత్రంలో ఆమె ఇందు పాత్రలో కనిపించబోతుంది.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *