హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్ట‌ర్ అదు సిద్ధు” అదితి రావ్ హైదరి తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ కొత్త జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌తో తనకున్న రిలేషన్ గురించి అదితి వెల్లడించింది. వీరిద్దరూ జంటగా నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఆమె చెప్పారు. హైద‌రాబాద్‌లో త‌న త‌ల్లి ప్రారంభించిన స్కూల్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్న అదితి. అక్క‌డే త‌న‌కు సిద్ధూ ప్ర‌పోజ్ చేయ‌డంతో కాద‌న‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చారు. ఆమె ఆశీస్సుల కోస‌మే తాను అక్క‌డ ప్ర‌పోజ్ చేసిన‌ట్లు ఆ త‌ర్వాత సిద్ధార్థ్ చెప్పాడ‌ని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *