యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా మూడవ సినిమా తీసుకువస్తున్నారు. మొదటి రెండు సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రాబోతున్న హిట్ – కేస్ 3లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాడు. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో చెప్పాకనే చెప్పాడు దర్శకుడు. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. అంటే విడుదలకు కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. కానీ ఎందుకనో ఈ సినిమాకు ఉంహిచనంత బజ్ రాలేదని చెప్పాలి. నిర్మాత కమ్ హీరో నాని విపరీతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆడియెన్స్ లో ఈ సినిమాపై అంత భారీ హైప్ రావట్లేదు. బహుశా ఇన్నిరోజులు నానిని నేచురల్ బాయ్ గా నటించిన నానిని అర్జున్ సర్కార్ గా రూత్ లాస్ పోలీస్ గా చూడలేకే ఇదిగా ఉన్నారా అనేది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే గాని క్లారిటీ రాదు. ఒకటి మాత్రం వాస్తవం హిట్ 3కి ప్రస్తుతం ఉన్న హైప్ సరిపోదు. ఇంతకు మించి ఇంకేదో కావాలి. అది కూడా వీలైనంత త్వరగా వస్తే డే 1 మంచి నంబర్ వచ్చే అవకాశం ఉంది.