నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. విశ్వక్ సేన్ తో మొదలైన హిట్ ఫ్రాంచైజీ, అడివి శేష్‌తో రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్‌లో అడుగుపెడుతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మింస్తున్నారు. ఇక మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ ‘హిట్ 3’ నుంచి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్,ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేయగా. ఎప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని ని మరి ఇంత వైలెంట్‌గా చూపించటం భయంకరంగా ఉందని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాయి.

ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా వదలడం లేదు. ఎలాంటి షోలు కూడా విడిచి పెట్టడం లేదు. అని విధాలుగా వారి చిత్రాలు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక నాని సినిమాలు అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. తన సినిమాల లాగే ప్రమోషన్స్ కూడా నాని వినూత్నంగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా తన హిట్ 3 మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా ట్రై చేయబోతున్నాడు నాని. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘హిట్ 3’ ఇంటర్వ్యూల తాలూకా సెటప్ వైరల్‌గా మారింది. సినిమా థీమ్‌కి తగ్గట్టుగా ఆయుధాలు, రక్తం ఇలా డిఫరెంట్‌గా మొత్తం సెట్ చేసి ప్లాన్ చేశారు. మొత్తానికి మాత్రం ‘హిట్ 3’ ప్రమోషన్ కూడా హిట్టే అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *