సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ వీడియో తాజాగా రిలీజ్ అయింది. ఇవాళ మెగా మేన‌ల్లుడి పుట్టినరోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ప్రీ లుక్ వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కండ‌లు తిరిగిన దేహంతో కొత్త అవ‌తారంలో క‌నిపించాడు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ ఈ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఎస్‌డీటీ 18 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కీరోల్‌లో న‌టిస్తోంది.

ఇక ఈ ప్రీలుక్ టీజ‌ర్‌లో గ్రాండ్ సెట్‌లు, పీరియాడిక్ ఆయుధాలు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్నాయి. ఇది ప్రారంభం మాత్రమేనని, సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసే అంశాలు మునుముందు మ‌రిన్ని వ‌స్తాయ‌ని మేకర్స్ పేర్కొన్నారు. కాగా, ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *