ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతడి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. కొరియోగ్రాఫర్ రేప్ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ జాతీయ అవార్డును నిలిపివేశారు. అంతకుముందు రంగారెడ్డి కోర్టు ఆయనకు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ అవార్డును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జానీమాస్టర్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో మళ్లీ రిమాండ్‌కు వెళ్లే అవకాశాలున్నాయి