దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన ‘దేవర’ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తారక్ మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవర-2 మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని ఎన్టీఆర్ అన్నారు.
అలాగే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడిన తారక్ తనకు, కల్యాణ్ రామ్‌కు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారు అని అన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉందని తెలిపారు. ఇక దేవరలో ఎన్టీఆర్ సరసన తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు.