Junior Movie Review: ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.
ఇది మూడేళ్ల క్రితమే ప్రారంభమైన సినిమా అయినా అనేక కారణాలతో వాయిదాలు ఎదురైంది. అందుకే కథనంలోనూ కొంత పాతదనముంది. ఒకే ఒక్క కొడుకును బొమ్మరిల్లు తరహాలో పెంచే తండ్రి, ఆ విషయం తట్టుకోలేని కొడుకు కాలేజ్‌లో చేరి ప్రేమలో పడడం, అక్కడ జరిగే గొడవలు, ప్రేమ విజయవంతం కావడం, తర్వాత ఉద్యోగంలో లేడీ బాస్‌తో వచ్చిన క్లాష్‌లు చివరికి ఆమెను రక్షించడం కథగా ఉంటుంది. ఈ పాయింట్లు చాలా సినిమాల్లో చూసినట్టు ఉండటం వల్ల కొత్తదనాన్ని అందించలేకపోయింది. అయితే కిరీటి నటన, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. డాన్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ శైలిని అనుసరించి ప్రేక్షకులను మెప్పించాడు. అతను ఎన్టీఆర్ అభిమానిగా కనిపించాడని చెప్పొచ్చు. శ్రీలీల తనదైన గ్లామర్‌తో అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. తొలి చిత్రంగానే కిరీటి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సరైన కథలు దొరికి భవిష్యత్తులో స్టార్‌గా ఎదిగే అవకాశముంది. మొత్తంగా చూస్తే ‘జూనియర్’ సినిమా ఓ సాదారణ స్థాయి ఫిల్మ్‌గా నిలిచింది.
Internal Links:
OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్..
సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్..