ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్`కల్కి 2898 ఏడీ’. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు మరియు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియుల్లో జోష్ నింపే వార్త ఒకటి తెగ వైరల్ అవుతుంది ఆగష్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు మూవీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో కీలక పాత్రా పోషించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా తనదైన శైలిలో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.