నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సయీ మంజ్రేకర్ కూడా కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో, కళ్యాణ్ రామ్, విజయశాంతి మరియు బృందం ఈరోజు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చిత్ర బృందాన్ని వేద పండితులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *