Kannapa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. స్టార్ నటులు మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్‌లతో మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ చిత్రం భక్తి నేపథ్యంతో కూడిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని యత్నించినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, నిర్మాతలు సినిమాను జూలై 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారని సమాచారం. థియేట్రికల్ రన్ కంటే త్వరగానే ఓటీటీలోకి రావడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విడుదల సమయంలో మంచు విష్ణు “పది వారాల వరకు ఓటీటీ రాకూడదు” అని చెప్పినప్పటికీ, ఇప్పుడు విడుదల వేగవంతం కావడంపై బాక్సాఫీస్ వైఫల్యమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, OTT విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ‘కన్నప్ప’ కథ భీకర గిరిజన యోధుడైన తిన్నడు అనే వేటగాడి జీవితం చుట్టూ తిరుగుతుంది. మొండి నాస్తికుడిగా ఉన్న తిన్నడు ఎలా శివ భక్తుడిగా మారాడన్న దానిపై ఈ కథ ఆధారపడింది. ఇందులో తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు, కిరాతుడిగా మోహన్ లాల్, రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, నెమలిగా ప్రీతి ముఖుందన్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు, నాతనాథుడుగా శరత్ కుమార్, పన్నాగగా మధూ నటించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Internal Links:
బాలయ్యతో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్..
External Links:
OTTలో ‘కన్నప్ప’ రిలీజ్.. నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి!