టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. విష్ణు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, టీజర్, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘శివ శివ శంకరా’ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.

ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించనుండటం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఓ గొప్ప భక్తిరస చిత్రంగా నిలవబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం కన్నప్ప టీజర్ చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *