మాటల మాస్టారు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఖలేజా చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. 2010 లో విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు నుండి చాలా గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైంది. సూపర్ హిట్ పాటలు, త్రివృక్రమ్ కాంబో కారణంగా ఒక రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అంచనాలను అందుకోవడంలో కొంత ఇబ్బంది పడింది.
అప్పట్లో థియేటర్లలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ సినిమా ఇప్పుడు ఒక క్లాసిక్. ఇప్పుడు కూడా ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు జనాలు షాక్ అవుతారు.

అయితే ఇటీవల టాలీవుడ్ లో రిలీరిజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీరిజ్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. మరి ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇదే నెలలో భరత్ అనే నేను, ఒక్కడు రీరిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖలేజా 4K లో రీరిలీజ్ అవుతుందని అందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కు ఖలేజా రీరిలీజ్ అవుతుందని సంతోష వ్యక్తం చేసారు. కానీ అలాంటిది ఏది లేదని కొందరు కావాలనే ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఖలేజా రిలీజ్ కు కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని అవి క్లియర్ అయితే తప్ప ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని ఆ సూచనలు ఏవిలేవని, ఖలేజా రీరిలీజ్ అనేది దుష్ప్రచారం అని తెలిపారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *