Kingdom Movie Song Release: గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా గౌతమ్-విజయ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కింగ్‌డమ్’ (KINGDOM) మూవీ ఇప్పటికే టీజర్, ట్రైలర్, ప్రమోషన్లతో ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేపింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన మరో పవర్‌ఫుల్ సాంగ్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ‘రగిలే రగిలే’ అనే లిరికల్ సాంగ్‌ను లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటను మేకర్స్ కింగ్‌డమ్‌కు పవర్‌ఫుల్ మ్యూజికల్ సౌల్‌గా పేర్కొన్నారు. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌కు సిద్ధార్థ్ బస్రూర్, అనిరుధ్ గొంతు కలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహభరితుల్ని చేశాడు.
‘‘మృత్యువు జడిసేలా.. పద పద.. శత్రువు బెదిరేలా.. పద పద.. గర్జన తెలిసేలా.. పద పద.. దెబ్బకు గెలిచేలా.. పద పదా..’’ అనే లైన్స్ గూస్బంప్స్ తెస్తున్నాయి. ఈ సినిమాకి ముందుగా విడుదలైన “అన్న అంటూనే”, “హృదయం లోపల” వంటి పాటలు ఇప్పటికే మంచి స్పందన పొందిన నేపథ్యంలో, తాజాగా వచ్చిన ‘రగిలే రగిలే’ సాంగ్ కూడా కింగ్‌డమ్ మ్యూజిక్ బాక్స్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ భారీ అంచనాల మధ్య కింగ్‌డమ్ మూవీ జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Internal Links:
మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్..
‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
External Links:
మృత్యువు జడిసేలా.. శత్రువు బెదిరేలా.. కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్