Kishkindapuri Premiere Talk: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన కిష్కింధపురి సినిమాను కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ థ్రిల్లర్ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ మంచి నమ్మకం పెట్టుకున్నాడు. ఈ నెల 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నిన్న రాత్రి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో జరిగింది. హీరో బెల్లంకొండ, అతని స్నేహితులు మరియు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. సినిమా చూసిన వాళ్ల మాటల్లో– కథ 2 గంటల 5 నిమిషాలు ఉంది, హారర్ ఎలిమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. అనుపమ పరమేశ్వరన్ రెండో భాగంలో దెయ్యం పాత్రలో ఆకట్టుకుంది. థ్రిల్లర్ సీన్లు, కథనం బాగున్నాయి. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండ్ భయపెట్టేలా ఉంది, డాల్బీ అట్మాస్‌లో బాగా నడిచింది. బెల్లంకొండ కొత్త జానర్‌లో కూడా బాగా నటించాడు. అయితే కొన్ని సన్నివేశాలు అవసరం లేనివి, అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపించిందని అంటున్నారు. మొత్తంగా సినిమా హిట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
Internal Links:
ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా..
External Links:
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్..