ధనుష్ హీరోగా జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.
జూన్ 20న వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. రెగ్యులర్ గా ప్రేమ కథలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల తన పంథా మార్చుకుని చేస్తున్న కుబేర ధనుష్ కు తెలుగులో మరో హిట్ సినిమా వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ‘కుబేర’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.