News5am, Latest Movie News (09-05-2025): విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మళ్లీ రావా సినిమాతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో తొలి భాగం కింగ్డమ్ అనే టైటిల్‌తో మే 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే అదే రోజున హరిహర వీరమల్లు విడుదలవుతుందన్న వార్తలతో కింగ్డమ్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. కానీ, బుక్ మై షోలో హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల అవుతుందని స్పష్టత రావడంతో కింగ్డమ్ విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, మరోవైపు కింగ్డమ్ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదన్న మాటలతో మే 30న విడుదల కష్టమేనని మరో వాదన వినిపిస్తోంది.
అయితే, ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం రిలీజ్ పోస్టర్ ద్వారా మే 30వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వచ్చిన వదంతులకు సమాధానం ఇచ్చినట్లయింది. ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విడుదలైన ఒక పాట ఈటీవీలో మంచి ఆదరణ పొందింది.
More Latest Movie News:
ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు..
More Latest Movie News: External Sources
KINGDOM: దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. ‘కింగ్డమ్’ కొత్త అప్డేట్తో అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది