Latest News Breaking

News5am, Latest News Breaking Telugu (29-05-2025): ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు రాజేష్ తుది శ్వాస విడిచారు. ఈ వార్త అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రాజేష్ దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు.
తొలుత హీరోగా, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు. రాజేష్ తమిళనాడు మన్నార్ గుడిలో జన్మించారు. తొలుత సీరియల్స్ ద్వారా సినీ రంగంలోకి వచ్చారు. 50 ఏళ్ల పాటు సినిమాల్లో నటిస్తూ ప్రజలను మెప్పించారు. ఇప్పటివరకు ఆయన మరణానికి గల కారణం తెలియలేదు. ఆయన ఆకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యతో బాధపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు.
రాజేష్ వయసు 75 సంవత్సరాలు. ఆయన మృతి సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బంగారు చిలక, మా ఇంటి మహారాజు వంటి సినిమాల్లో కనిపించారు. తమిళ్, మలయాళం సినిమాల్లోనూ ఎక్కువగా నటించారు. అభిమానులు కన్నీటిలో మునిగిపోయారు.

More News:

Latest News Breaking Telugu

‘OG’ మూవీలో మరో హీరోయిన్..

నందమూరి తారక రామారావు 102వ జయంతి..

More Latest News Breaking: External Sources

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హీరో రాజేష్ కన్నుమూత..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *