News5am, Latest Telugu News ( 02/05/2025) : నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే, మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా, చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికి నాని తన మాట నిలబెట్టుకున్నాడు. హీరోగా నిర్మాతగా మరో సారి తనని తాను నిరూపించుకున్నాడు.
ఇక దర్శకుడి గురించి మాట్లాడుకుంటే, అర్జున్ సర్కార్ కేరక్టర్ ఇంట్రో నుంచే ఆ పాత్రపై ఆసక్తిని రేకెత్తించాడు శైలేష్ కొలను. ఇక జనం మెచ్చేలా తీసిన కూడా హింసత్మక సీన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. కానీ చివర్లో అడవి శేషు సడన్ ఎంట్రీ, ‘హిట్ 4’ అంటూ కార్తీ ఎంటర్ అవ్వగానే, థియేటర్ దద్దరిల్లిపోయింది. మొత్తనికి హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం విశేషం. పార్ట్ 4 కూడా ఇంతకు మించి అనేలా ఉండబోతుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బ్లాక్ బస్టర్ ‘హిట్ 3’ కి గత 24 గంటల్లో బుక్ మై షో లో 270.27K టిక్కెట్లు బుక్ అయ్యాయి. నేచురల్ స్టార్ కెరీర్‌లో ఇది అతిపెద్ద ఓపెనింగ్ అని చెప్పోచ్చు.