News5am, Latest News Telugu (30-05-2025): జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’కి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి గురువారం ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. నార్త్ ఇండియాకు చెందిన ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), సౌత్‌కు చెందిన ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా, భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాల్లో ఉన్న తేడాల కారణంగా వారి పెళ్లికి ఎదురయ్యే అవాంతరాలను వినోదభరితంగా చూపించేలా టీజర్ ద్వారా తెలుస్తోంది.
కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్, సిద్ధార్థ్-జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ, సోను నిగమ్ ఆలపించిన నేపథ్యగీతం టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీజర్ చివర్లో జాన్వీ చేతిలో కత్తితో కనిపించే సన్నివేశం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా జులై 25న విడుదల కాబోతుంది.
More Latest News Telugu Movies:
Cinema News Telugu:
తండ్రి డైరక్షన్‌లో హీరయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కూతురు..
ప్రభాస్ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా..
More Latest News Today: External Sources
జాన్వీకపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్గా టీజర్