News5am, Latest News Telugu (14-06-2025): ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుందనుకున్నారు, కానీ సిజీ వర్క్ పూర్తి కాలేదు. దీంతో సినిమా మరోసారి వాయిదా పడింది. అసలు ఈ సినిమా నిన్నటికే థియేటర్లలోకి రావాల్సి ఉండగా, విడుదల చేయడం లేదని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల 18న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొదట దర్శకుడు క్రిష్ రూపొందించగా, బడ్జెట్ సమస్యల కారణంగా ఆయన తప్పుకుని, నిర్మాత ఏ.ఎమ్. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది, ఇప్పుడు మొదటి భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ అయితే, ఈ నెల బాక్సాఫీస్‌లో పెద్దగా హల్చల్ ఉండకపోవచ్చు. హరిహర వీరమల్లు సినిమా తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జీవితకథ ఆధారంగా తెరకెక్కిందన్న ప్రచారం ఉంది. ఆయన మొగల్ కాలంలో ధనవంతులను దోచి, పేదలకోసం ఉపయోగించాడని చెబుతారు. పవన్ కళ్యాణ్ ఈ పాత్రకు పూర్తిగా సరిపడాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ, సినిమా నిజంగా విడుదల అవుతుందా లేదా అన్న అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, సినిమా విడుదలయ్యే వరకు ఎవరూ నమ్మలేరు.
More Updated News Telugu:
Latest Telugu:
త్రివిక్రమ్‌తో వెంకటేశ్ సినిమా..