News5am, Latest News Telugu Breaking (28-05-2025): పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండితెరపై కనిపించలేదు. చివరిగా 2023లో వచ్చిన ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు మరికొన్ని భారీ చిత్రాలతో మళ్లీ రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాలో ఒకటి ‘ఓజీ’. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడి కోడలిగా రాబోతున్న నటి సిరి లేళ్ళ, ‘ఓజీ’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. త్వరలో నారా రోహిత్‌ను వివాహం చేసుకోనున్న సిరి, గతంలో ఆయనతో కలిసి ‘ప్రతినిధి-2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి, ఇటీవలే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఇటీవల నారా రోహిత్ తండ్రి మరణించడంతో వారి వివాహం వాయిదా పడింది. ఇప్పుడు సిరి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
More News:
Latest News Telugu Breaking
నందమూరి తారక రామారావు 102వ జయంతి..
ప్రభాస్ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా..