News5am, Latest Telugu Movie News (20-05-2025): మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో తొలిసారి నటిస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇప్పుడు రెండో భాగంలో తారక్, హృతిక్ రోషన్ తలపడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని సమాచారం.
తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వార్ 2’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ మూవీ అప్‌డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చిత్రబృందం అదిరిపోయే వీడియోను విడుదల చేసింది. మొత్తానికి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
More Latest:
Latest Telugu Movie News:
తారక్ బర్త్ డే సందర్భంగా, మోత మోగిపోతున్న సోషల్ మీడియా..
టీజర్ విడుదలకు హాజరైన అలేఖ్య చిట్టి పికిల్స్ చెల్లి రమ్య మోక్ష.
More Latest Telugu News: External Sources
వార్ 2 టీజర్ విడుదల.. అదరగొట్టిన తారక్