Telugu Latest News New

News5am Latest Telugu News ( 08/05/2025) : టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ఇక అలా పిలవకూడదేమో. ఎందుకంటే సమంత తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గించుకొని నిర్మాతగా మారింది. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఈ చిత్రంలో సి. మల్గిరెడ్డి, ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్‌ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న విడుదలకానుంది.

ఇక ఈ సినిమాను ఇటీవల కొన్ని లిమిటెడ్ ప్రదేశాల్లో ప్రీమియర్ చేశారు. ఆ ప్రీమియర్లపై వచ్చిన టాక్ ఏంటంటే, ట్రైలర్‌లో చూపినట్టే కథ, పిల్లా, పెళ్లి, పిల్లోడు అనే లైన్‌తో స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొన్నిచోట్ల నవ్వులు పుట్టించడమో, కొన్నిచోట్ల భయపెట్టడమో కనిపిస్తుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కానీ కథ ఎక్కడికక్కడ డిప్ అవుతుంది. కొన్ని సీన్లు షార్ట్ ఫిల్మ్ లా అనిపిస్తాయి. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వల్‌కి వెళ్లింది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ సరే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తారుమారైంది. అసలు సమస్య ఏమంటే, చిన్న కథను లాగాలంటే బలమైన స్క్రీన్‌ప్లే అవసరం. కానీ ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే ఆ స్థాయిలో ఆకట్టుకోదు. కథ పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై చూపించిన విధానం తగ్గిపోతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ‘శుభం’ సినిమా ఓసారి చూడొచ్చు, కానీ థియేటర్‌లో కాకుండా ఓటీటీలో చూడడం బెటర్.

Latest Telugu News

Latest Telugu News :

రత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు..

కాల్పుల విరమణ తర్వాత భారత్పై పాకిస్తాన్ దాడి..

More Telugu News : External Sources

https://ntvtelugu.com/movie-news/good-morning-premier-talk-a-little-bit-of-this-a-little-bit-of-that-795652.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *