News5am Latest Telugu News(05/10/2025): శ్రీ విష్ణు హీరోగా నటించిన “సింగిల్” సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలోని హాస్యం, శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌కి ప్రేక్షకులు మంచి స్పందన చూపుతున్నారు. వెన్నెల కిషోర్‌తో కలిసి శ్రీ విష్ణు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. గతంలో వచ్చిన “స్వాగ్” సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా, “సింగిల్” సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, మొదటి రోజు ఈ సినిమా రూ. 4.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పాజిటివ్ మౌత్‌టాక్ కారణంగా రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్రబృందం ఆశిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో $150K వసూలు చేసింది. కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించబడింది. ఇది ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. తమిళ దర్శకుడు రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి నందు, భాను డైలాగ్స్ అందించగా, అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ విష్ణు చెప్పిన సింగిల్ లైనర్స్ సినిమాకి స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి.
More Latest Telugu News
Latest Telugu News
సినిమా సింగిల్ కానీ కలెక్షన్స్ డబుల్
వాణిజ్యంలో భారత స్టాక్ మార్కెట్