Lenin Movie Update: అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘లెనిన్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో తొలుత శ్రీలీలా కథానాయికగా ఎంపికైనప్పటికీ, అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగింది.
శ్రీలీలా చిత్ర బృందం నుంచి తప్పుకున్న తర్వాత మేకర్స్ షూటింగ్‌ను మరింత వేగవంతం చేశారు. ఆమెతో ఇప్పటికే షూట్ చేసిన రెండు వారాల సీన్లను ఇప్పుడు భాగ్యశ్రీతో రీషూట్ చేయాలని నిర్ణయించారు. అన్ని సీన్లను మళ్లీ చిత్రీకరించనున్నందున టీమ్‌పై పని భారంగా మారనుంది. భాగ్యశ్రీ జూలై 16 నుంచి సెట్స్‌లో పాల్గొననుందని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాస్ అప్పీల్, స్టైలిష్ కథనం కలిసి అఖిల్‌కు హిట్ ఖచ్చితమా? అనే విషయమై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Internal Links:
విశాఖలో ‘అల్లు అర్జున్’ మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం..
హైదరాబాద్‌లో రెహమాన్ మ్యూజిక్ ఫీస్ట్..
External Links:
అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ