Little Hearts: 90వ దశకంలో ఫేమస్ అయిన మౌళి హీరోగా, వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ సినిమా లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద సినిమాలతో పోటీగా థియేటర్లలో రిలీజ్ అయింది. కంటెంట్‌పై నమ్మకంతో మేకర్స్ రిలీజ్‌కు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు వేశారు. ఆ షోలు నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ఫలితంగా మొదటి రోజే మంచి వసూళ్లు రాబట్టింది.
పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.15 లక్షలకు పైగా గ్రాస్ సాధించిన లిటిల్ హార్ట్స్, మొదటి రోజు మౌత్ టాక్‌తో హౌస్‌ఫుల్ షోలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.2.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఓవర్సీస్‌లో కూడా 75 వేల డాలర్లతో మంచి స్టార్ట్ ఇచ్చింది. ఈ జోరు కొనసాగితే ఇటీవలి పెద్ద సినిమాల కలెక్షన్లను కూడా దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంటోంది. స్టార్ వాల్యూ లేదా భారీ బడ్జెట్ కంటే కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తారని మళ్లీ నిరూపితమైంది. వీకెండ్ కావడంతో రెండో రోజు మరింత వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Internal Links:
అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్..
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్ అదిరింది..
External Links:
అదరగొట్టిన లిటిల్ హార్ట్స్.. మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?