ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుండి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథ, కామెడీ మరియు వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ మొదటి భాగం దాటి తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడా బోరింగ్ సీన్లు లేవు. ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ ఫుల్ కామెడీ సినిమాను ఆస్వాదించాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మీల్ లాంటిది. యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ కూడా మ్యాడ్ స్క్వేర్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది.
దీంతో ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి, ఈ సక్సెస్ మీట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి మొదలైంది.