బ్లాక్ బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ వైరల్ గా మారింది. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు), ‘మ్యాడ్ స్క్వేర్’లో అల్లరి చేయబోతున్నారు. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్ ను మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని సినిమా బృందం తెలిపింది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.