Madhavan stranded in Leh: జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలువురు విమానాలను అధికారులు రద్దు చేయడంతో నటుడు మాధవన్ లేహ్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, వర్షాల కారణంగా లేహ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, ఇది 17 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసిందని చెప్పారు. ప్రతి సారి లఢఖ్‌కి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు.
2008లో త్రీ ఇడియట్స్ సినిమా షూటింగ్ కోసం లఢఖ్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని మాధవన్ గుర్తుచేశారు. అప్పుడు కురిసిన భారీ మంచు వల్ల విమానాశ్రయాలు మూసివేయబడ్డాయని, దీంతో మొత్తం సినిమా బృందం అక్కడే ఉండిపోయిందని తెలిపారు. అయినప్పటికీ, ఈ ప్రాంతం ఎప్పటికీ అందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Internal Links:
External Links:
లేహ్ లో చిక్కుకుపోయిన మాధవన్.. వర్షాలకు విమానాలు రద్దయ్యాయని వెల్లడి