టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్ లో 29వ సినిమా చేయబోతున్నాడు. అందుకోసం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం పొడవాటి జుట్టు, గడ్డం, కండలు తిరిగిన శరీరాన్ని పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. ఇటీవల పొడవాటి జుట్టుతో మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ లుక్ సూపర్ గా ఉందని అభిమానులు, సినీ ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజాగా వినిపిస్తిన్న వార్తల ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరు లో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. బాహుబలి సిరీస్ తరహాలోనే మహేశ్ తో చేయబోయే సినిమాను కూడా రెండు భాగాలుగా తెరెకెక్కించే ఆలోచనలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడది ఆ న్యూస్ సారాంశం. ఆల్రెడీ ,హీరో మహేశ్ కు ముందుగానే చెప్పేసాడని, అందుకు గాను మహేశ్ 5 సంవత్సరాలు డేట్స్ ఇచ్చేసాడని టాక్ నడుస్తోంది. కానీ ఐదు సంవత్సరాలు అంటే ప్రైమ్ టైమ్ పోతుంది అని మహేశ్ ఫాన్స్ వాపోతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ‘GOLD’గరుడ, ఇలా రోజుకొక టైటిల్ ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి ప్రతి రోజు ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు అని సమాచారం.