యంగ్ హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు ‘మజాకా’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు, సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పెళ్లికొడుకు గెటప్ లో కనిపిస్తున్నాడు. అతని చుట్టూ పెళ్లి హడావుడి కనిపిస్తోంది.
కాగా ధమాకా తరవాత నక్కిన త్రినాథరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మజాకా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత. రాజేష్ దండా నుంచి వచ్చిన ‘సామజవరగమన’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మజాకా కూడా మంచి విజయాన్ని సాధిస్తోందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించారు.