సుహాస్ హీరోగా సందీప్ బండ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక . దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సంగీర్తన కథానాయికగా నటిస్తుండగా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మిడిల్ క్లాస్ యువకుడు (సుహాస్) పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువవుతాయని పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పిల్లలు కావాలనుకుంటారు.
సడెన్‌గా అతడి భార్య గర్భవతి అంటూ షాక్ ఇస్తుంది. అయితే తాను వాడిన కండోమ్ వలనే ఇలా అయ్యిందంటూ నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. ఈ కేసు సుహాస్ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకువచ్చింది. చివరికి ఆ కేసు గెలిచాడా? లేదా? అనేది తెలియాలంటే కచ్చితంగా మూవీని చూడాల్సిందే. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.