Mana Shankara Varaprasad Garu Ott Release

Mana Shankara Varaprasad Garu Ott Release: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి మాస్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఎంటర్టైన్మెంట్‌తో సినిమాను హిట్‌గా నిలిపారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా గుర్తింపు పొందింది. థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (Zee5) దక్కించుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం, నయనతాన నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే వెంకటేష్ చేసిన ప్రత్యేక పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆదరణ పొందుతుందో చూడాలి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *