Manoj Manchu: రాకింగ్ స్టార్ మనోజ్ మంచు తన రెండో ఇన్నింగ్స్‌లో శక్తివంతమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. హనుమా రెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పీరియాడిక్ ఇతిహాస చిత్రం కావడంతో తెలుగు సినిమా రంగంలో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
డేవిడ్ రెడ్డి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే యాక్షన్ డ్రామా. ఇందులో మనోజ్ శక్తివంతమైన కొత్త పాత్రలో కనిపించనున్నాడు. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధైర్యవంతుడి భావోద్వేగభరిత కథ ఇది. మనోజ్ 21 ఏళ్ల క్రితం ఇదే రోజున “దొంగ దొంగడితో” సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అదే రోజున “డేవిడ్ రెడ్డి” అనే సినిమాను ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. టైటిల్ పోస్టర్ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో రూపొందించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. “మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు” అనే ట్యాగ్‌లైన్ సినిమాకు శక్తిని చేకూరుస్తోంది.
Internal Links:
తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు..
‘అతడు’ రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..
External Links:
‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. టైటిల్ పోస్టర్ సూపర్