శ్రీసింహ హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన మత్తువదలరా చిత్రానికి సీక్వెల్ గా మత్తువదలరా-2 రూపొందింది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాగా, ఫస్ట్ రన్ నుండి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ మత్తెక్కించాయి. శ్రీ సింహా మరియు సత్య యొక్క కామెడీ నవ్వు తెప్పించే, ఉల్లాసకరమైన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.
ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 5.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం ముగిసే సమయానికి 24.01 కోట్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో $300K పైగా కలెక్ట్ చేసింది మరియు పాజిటివ్ బజ్ మరియు మౌత్ టాక్ తో $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. మరోవైపు ఈ వీకెండ్ మారే సినిమాలు లేకపోవడంతో రెండో వారంలో డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా బయ్యర్స్ కు లాభాల తెచ్చిపెట్టింది. మత్తువదలరా 3, 4 కూడా తెరకెక్కిస్తామని ఆ మధ్య జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు నితీష్ రాణా ప్రకటించిన సంగతి తెలిసిందే.