విక్రమ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగళన్’లో నటిస్తున్నాడు. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలు. కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు సానుకూల స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. నిజానికి ఈ సినిమా జనవరి 26న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన టాలీవుడ్ నుంచి ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుండగా, బాలీవుడ్ నుంచి ‘స్త్రీ 2’ రాబోతోంది. ఈ రెండు చిత్రాలతో ‘తంగళన్’ పోటీ పడబోతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.